చిట్టత్తూరు చెరువు దున్నేశారు! | - | Sakshi
Sakshi News home page

చిట్టత్తూరు చెరువు దున్నేశారు!

May 26 2026 8:00 AM | Updated on May 26 2026 8:00 AM

తొట్టంబేడు: చిట్టత్తూరు రెవెన్యూ లెక్కల దాకాల, సర్వే నంబర్‌ 41, 42, చిన్న చెరువు పెద్ద చెరువు ఉన్నాయి. ఈ చెరువులు తెలుగు గంగ కాలవ ఆనుకుని ఉండడంతో ఎప్పుడు నీళ్లు ఉంటాయి. ఈ విషయం గుర్తించిన కబ్జాదారులు చెరువును ఆక్రమించుకుని, దున్నేసి సాగు చేస్తున్నారు. మా చెరువుని కాపాడండి అని గత ప్రభుత్వం హయాంలో ఒక దినపత్రిక వార్త రాయడంతో అప్పటి అధికారులు వెంటనే స్పందించి, చెరువు భూముల్లో ఎవరు దిగకూడని జేసీబీతో పెద్ద కాలువ తీయించారు. కబ్జాదారులు సుమారు 25 ఎకరాలు చెరువును మళ్లీ ఆక్రమించుకుని పంటలు పండించే వారు. ఇది తప్పు అని గత ప్రభుత్వంలో చిట్టత్తూరు గ్రామ ప్రజలు అప్పటి అధికారులకు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన అధికారులు చిట్టతూరు చెరువు భూమిని సర్వే చేయించి, హద్దులను ఏర్పాటు చేసి, పెద్ద కాలువ తవ్వించారు. అప్పటి నుంచి ఆ భూముల్లోకి ఎవరు దిగకుండా ఉన్నారు.

మళ్లీ మొదట కొచ్చిన భూ కబ్జా వ్యవహారం

ఆయకట్టదారుడే అందరినీ ఉసిగొలిపి చెరువును దున్నేయండని సలహా ఇచ్చి చెరువును దున్నేశారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. అయితే మామూళ్ల మత్తుకు అలవాటపడిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి చిట్టత్తూరు చెరువు ఆక్రమణలను అడ్డుకుంటారా? అసలు చేరువే లేకుండా చేస్తారా? అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement