అంకితభావంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అంకితభావంతో పనిచేయాలి

May 26 2026 8:00 AM | Updated on May 26 2026 8:00 AM

కేవీబీపురం: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని తిరుపతి డీఈఓ కేవీఎన్‌ కుమార్‌ తెలిపారు. విద్యాశా ఖ ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఎంఈఓలు లక్ష్మీపతి, రవికుమార్‌ మండల కేంద్రంలో, అలాగే రాగిగుంటలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూ లం హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పదో తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన అంజూరు పాలెం ఏ.ధనుష్‌ (578), రెండో స్థానం మంజూరు పి. సూర్య (574), మూడో స్థానం రాగిగుంట కె. భవ్య శ్రీ (573) సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే ఆదిమూలం సత్కరించి, జ్ఞాపిక, రూ. 5వేలు ఆర్థిక సాయం అందజేశారు. అలాగే మండలంలో 500 మార్కులు సాధించిన 30 మంది విద్యార్థులకు జ్ఞాపిక అందజేసి, సత్కరించారు. అనంతరం బడి పిలుస్తోంది ప్రచార రథాన్ని ఎమ్మెల్యే ఆదిమూలం, డీఈఓ కుమార్‌లు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీపీ సుబ్రహ్మణ్యం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీహరి యాదవ్‌, రమేష్‌, బాలాజీ, అయ్యప్ప, జనార్ధన్‌, ఆర్ముగం, శివరావు, ఎంపీడీఓ మాలతి, ఏఎస్‌ఓ పార్థసారథి, సత్యవేడు ఎంఈఓ రవి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement