కరాటే జాతీయస్థాయి ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

కరాటే జాతీయస్థాయి ఎంపిక పోటీలు

May 26 2026 8:00 AM | Updated on May 26 2026 8:00 AM

సత్యవేడు: మండల కేంద్రంలోని వైదేహి కళ్యాణ వేదికలో ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి కరాటే ఎంపిక పోటీలకు 400 మంది హాజరయ్యారు. ఆదివారం జరిగిన ఈ ఎంపిక పోటీల్లో కటా, కుముతీ విభాగాలకు ఆంఽఽధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు నుంచి కటా పోటీల్లో 250 మంది, కుముతే పోటీల్లో 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలకు జీఎం భువనేశ్వర్‌, జే.సూర్య, జగదీష్‌, టి సూర్య, పురుషోత్తం కాబిన్‌, హరి ఆర్గనైజర్లుగా వ్యవహరించారు. 30 మంది మాస్టర్లు ఈ పోటీలను పర్యవేక్షించారు. సత్యవేడు నుంచి 40 మంది క్రీడాకారులు పాల్గొనగా 35 మంది ప్రథమస్థానం, ముగ్గురు ద్వితీయ స్థానం, ముగ్గురు తృతీయస్థానంలో నిలిచారు. చంద్రశేఖర్‌ నాయుడు(తిరుపతి), రత్నాకర్‌(తిరుపతి), నందా(కుప్పం), ప్రతాప్‌(కుప్పం), ఆఖిల్‌(హైదరాబాద్‌), పందామన్‌(తమిళనాడు) సతీస్‌(ఆంధ్రా) విజేతలుగా ఎంపిక చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన విల్సన్‌ రాబర్ట్‌ మిల్లర్‌, బాలాజీ, రాజశేఖర్‌, మాజీ సర్పంచ్‌ మంజులా రమేష్‌, విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement