రైల్వే పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం | - | Sakshi
Sakshi News home page

రైల్వే పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం

May 26 2026 8:00 AM | Updated on May 26 2026 8:00 AM

సూళ్లూరుపేట రూరల్‌: స్థానిక రైల్వేస్టేషన్‌ పరిధిలోని కేఎం నంబర్‌ 81–2–4 పోస్టు సమీపంలోని ఆర్‌ఎస్‌ ఆరోగ్య కేంద్రం వద్ద 54 ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని సోమవారం రైల్వే పోలీసులు గుర్తించారు. జీఆర్‌పీఎఫ్‌ హెచ్‌సీ రమేష్‌ కథనం మేరకు.. గుర్తుతెలియని వ్యక్తి రైల్వే పట్టాలపై అపస్మారస్థితిలో పడి ఉన్నాడు. రైల్వే పోలీసులు వెంటనే గుర్తించి సూళ్లూరుపేట స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రైల్వే పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు.

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

తొట్టంబేడు: మండలంలోని శివనాథపురం గ్రామానికి చెందిన రమేష్‌ (35) అనే వ్యక్తి సోమవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. గ్రామం సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న రమేష్‌ను 108 వాహనంలో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మద్యం అధికంగా తీసుకున్నాడని వైద్యం చేసి పంపించేశారు. తెల్లవారే సరికి రమేష్‌ మృతి చెందాడు. మృతిపై అనుమానాలు ఉనానయంటూ భార్య అర్చన ఫిర్యాదు మేరకు తొట్టంబేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement