2 నుంచి 8 వరకు ‘సీసీఎల్‌’ | - | Sakshi
Sakshi News home page

2 నుంచి 8 వరకు ‘సీసీఎల్‌’

May 25 2026 9:57 AM | Updated on May 25 2026 9:57 AM

● బిడ్డింగ్‌ ద్వారా 8 జట్ల ఎంపిక

తిరుపతి ఎడ్యుకేషన్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ (సీడీసీఏ) ఆధ్వర్యంలో జూన్‌ 2 నుంచి 8వ తేదీ వరకు కార్పొరేట్‌ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌) పోటీలు నిర్వహించనున్నారు. ఆదివారం ఈ మేరకు తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో బిడ్డింగ్‌ ద్వారా జట్ల ఎంపిక చేపట్టారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) పర్యవేక్షణలో ప్రక్రియ పూర్తి చేశారు. అనంతరం ఏసీఏ సంయుక్త కార్యదర్శి విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఐపీఎల్‌, ఏపీఎల్‌ తరహాలో టర్ఫ్‌ పిచ్‌లపై పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. సమయాభావం కారణంగా కేవలం 8 జట్లతో తొలిసారిగా ఈ పోటీలను నిర్వహించనున్నట్లు వివరించారు. అయితే ఈ పోటీలకు నగరంలో విశేష స్పందన వచ్చిందని, మొత్తం 22జట్లు ఈ పోటీల్లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. కానీ, బిడ్డింగ్‌ ద్వారా 8జట్లను మాత్రమే ఎంపిక చేశామన్నారు. తిరుపతి గొల్లవానిగుంటలోని క్రికెట్‌ మైదానంలో జూన్‌ 2నుంచి 8వ తేదీ వరకు ప్రతి రోజు రెండు మ్యాచ్‌లను లైవ్‌ ద్వారా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విన్నర్స్‌కు రూ.లక్ష, రన్నర్స్‌కు రూ.50వేల బహుమతి అందించనున్నట్లు వివరించారు. సమావేశంలో సీడీసీఏ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసమూర్తి, సతీష్‌యాదవ్‌, కోశాధికారి శివప్రసాద్‌, ఉపాధ్యక్షులు శ్రీధర్‌కుమార్‌, రవి, సభ్యులు సత్యశ్రీనివాస్‌, రమణ, మార్కండేయులు, అంపైర్‌ కమిటీ సభ్యులు సుదర్శన్‌, రామకృష్ణ, ఉదయ్‌కుమార్‌, జీవన్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

ఎంపికై న జట్లు

తిరుపతి హోటల్స్‌, రమణ లాజిస్టిక్స్‌, జీవీఎస్‌సీఎస్‌ (టీచర్స్‌), జర్నలిస్టులు (జేశాప్‌), సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం, జేఎస్‌ఈఈ సొల్యూషన్స్‌

తిరుపతి వార్డు సచివాలయ సంఘం

జాతీయ సంస్కృత విద్యాపీఠం

Advertisement
 
Advertisement
Advertisement