దిక్కుతోచడం లేదు | - | Sakshi
Sakshi News home page

దిక్కుతోచడం లేదు

May 25 2026 9:57 AM | Updated on May 25 2026 9:57 AM

కాయలున్న సమయంలో ధరలు లేక నష్టపోతున్నాం. ధరలుంటే అసలు దిగుబడి ఉండదు. ప్రస్తుతం నిమ్మకు తెగుళ్లు సోకాయి. ఈ కాయలను కొనేందుకు ఎవరూ రావడం లేదు. విధి లేక మార్కెట్‌కు తీసుకెళుతున్నాం. కొందరు కోతల ఖర్చులైనా మిగులుతాయని చెట్లకే కాయలను వదిలేస్తున్నారు. ఈ నెల తొలివారం వరకు ధరలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు రేటు చూస్తే కడుపు మండిపోతోంది. కేజీ కాయలను రూ.20కే అడుగుతున్నారు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.

– దాయోదర్‌రాజు, నిమ్మ రైతు, సైదాపురం

నష్టపోయాం

నిమ్మ చెట్లకు వివిధ రకా ల తెగుళ్లు పట్టాయి. ఇటీవల కురుస్తున్న జల్లులకు నల్లమచ్చల తెగులు సైతం సోకింది. దీంతో 30శాతం పంట పూర్తిగా దెబ్బతింది. మచ్చ లేని కాయలనే ఏరుకుని కొనుగోలు చేస్తున్నారు. ధరలు పుంజుకుంటున్న సమయంలోనే మాకు తెగుళ్ల కారణంగా భారీ నష్టం వచ్చింది. అలాగే ఈదురుగాలులకు చెట్టు పడిపోవడంతో మరింతగా నష్టపోయాం. ఈ ఏడాది పెట్టుబడి సంగతి దేముడెరుగు.. తీసుకున్న అప్పులకు వడ్డీ కూడా కట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి కష్టం పగవాళ్లకి కూడా రాకూడదు. గాలిలో దీపం మాదిరిగా తయారైంది నిమ్మరైతుల దుస్థితి.

– శ్రీనివాసులు రాజు, నిమ్మ రైతు, సైదాపురం

Advertisement
 
Advertisement
Advertisement