ప్రశాంతంగా యూపీఎస్సీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా యూపీఎస్సీ పరీక్షలు

May 25 2026 9:57 AM | Updated on May 25 2026 9:57 AM

తిరుపతి అర్బన్‌ : యూపీఎస్సీ పరీక్షలను ఆదివారం ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి తిరుపతిలోని పద్మావతి బాలికోన్నత పాఠశాల, పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల, ఎస్వీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ సజావుగా పరీక్షలు నిర్వహించిన అధికారులను అభినందించారు. ఉదయం పరీక్షకు 64.01 శాతం, సాయంత్రం సెషన్‌కు 63.11 శాతం హజరైనట్లు వెల్లడించారు. యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరిశీలకుడు శేషగిరిబాబు, డీఆర్‌ఓ నరసింహులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement