– 8లో
తిరుపతి పార్లమెంట్ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు.
మా కుటుంబాన్ని వీధిపాలు చేశారు
నాకు భర్త లేడు. ముగ్గురు బిడ్డలను నేనే పోషించుకుంటున్నాను. ఏడేళ్లుగా బండిపై టిఫిన్ అమ్ముకుంటూ బతుకుతున్నాం. నా కష్టాన్ని చూసి ఉదయం, సాయంత్రం వేళల్లో నా బిడ్డలు నాకు సహాయంగా నిలబడ్డారు. తోపుడు బండిపై టిఫిన్ విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్న నా కుటుంబాన్ని పాలకులు రోడ్డుపాలు చేశారు. రేపటి నుంచి మేము ఎలా బతకాలి. మా పాపం ఊరికే పోదు. దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరు సర్వనాశనం అయిపోతారు. – సునంద, బాధితురాలు
బుద్ధి లేక ఓట్లు వేశాం
పేదలపై ప్రతాపం చూపిస్తారనేనా? మీకు ఓట్లు వేసింది. బుద్ధి గడ్డి తిని మీకు ఓట్లు వేశాం. అందుకు మా చెప్పుతో మేమే కొట్టుకున్నట్లు అయింది. ఒక పాలకుడైన మాకు అండగా నిలబడ్డాడా. మా ఉసురు తగలకుండా పోదు. తిరుపతందా రోడ్లు, ఫుట్ పాత్ లను అక్రమించి వ్యాపారం చేసుకుంటున్నారు. వాటిని వదిలి మా పైనే పడతారా. మేము ఏ పాపం చేశామని మాకు ఈ శిక్ష వేశారు. – దేవి, బాధితురాలు
ఓట్ల కోసం ఏ నా కొడుకు
మా ఇళ్లకు రావద్దు
మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. మాకు అండగా ఉంటారనుకున్న వాళ్లే మమ్మల్ని శత్రువులుగా చూశారు. ఇక ఏ నా కొడుకు ఓట్లు కోసం మా గడప తొక్కద్దు. వస్తే చెప్పులతోనే కొడతాం. పేదల పైనా మీ ప్రతాపం. ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ భూములు తినేస్తున్నారు. అలాంటి వాళ్లను వదిలి పొట్టకూటి కోసం కష్టపడే మా కడుపు కొడతారా.
– సుబ్బలక్ష్మమ్మ, బాధితురాలు
సర్వనాశనం అయిపోతారు
మాపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి, వంట సామగ్రి, తోపుడుబండ్లను ధ్వంసం చేశారు. మా కుటుంబాలను వీధిలోకి లాగారు. యాత్రికులకు, వాహనచోదకులకు మా వల్ల ఎలాంటి ఆటంకం లేదు. తక్కువ ధరలకే మేము మంచి టిఫిన్ అందిస్తున్నాం. వ్యాపారం జరిగితే కానీ పూట గడవని మాలాంటి వాళ్లపై ఈ ప్రభుత్వం దౌర్జన్యం చేయడం సిగ్గుచేటు. నాకు ప్రత్యామ్నాయం చూపించండి.
– సంధ్య, బాధితురాలు


