– ఎంపీ గురుమూర్తి
తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి తెలిపారు. తిరుపతిలోని ఎంపీ కార్యాలయంలో శనివారం పార్లమెంటు పరిధిలోని పలువురు వివిధ సమస్యలపై ఎంపీని కలిసి వినతులు అందజేశారు. వైఎస్సార్‌సీపీ పాలనలో తమకు ఎలాంటి సమస్యలు ఉండేవి కావని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని సమస్యలేనని ప్రజలు ఎంపీ వద్ద విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ తిరుపతి పార్లమెంట్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ వారికి హామీ ఇచ్చారు.


