సూళ్లూరుపేట: తడ మండలం కొండూరు వద్ద అపాచీ కంపెనీకి వెళ్లే క్రాస్‌రోడ్డు సమీపంలోని గోరింటాకు చెట్ల మధ్యలో సుమారు 55 ఏళ్ల గుర్తు తెలియనివ్యక్తి మృతి చెందాడు. స్థానికులు ఈ విషయం గుర్తించారు. శుక్రవారం ఎండకు వడదెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయాడని భావించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది అతడిని వెంటనే సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ 22వ తేదీ ఉదయం మృతి చెందాడు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అతని ఊరు, పేరు తెలియలేదు. మృతుడు మెర్యూన్ కలర్, తెలుపు అడ్డగీతలు కలిగిన టీషర్టు, గ్రే కలర్ ప్యాంట్ వేసుకుని ఉన్నాడు. కొండూరు వీఆర్వో ఫిర్యాదు మేరకు తడ ఎస్‌ఐ కొండపనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


