తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని అన్ని పీజీ కళాశాలలకు ఈనెల 15 నుంచి జూన్ 28వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. వర్సిటీ పరిధిలో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల చదువుతున్న విద్యార్థులకు జూన్ 29వ తేదీన యథాతధంగా తరగతులు ప్రారంభమవుతాయని వర్సిటీ అధికారులు తెలిపారు.
నేటితో ముగిసిన గడువు
– తుది దశలో బ్రిడ్జి మరమ్మతు పనులు
రేణిగుంట: పట్టణానికి ముఖద్వారంగా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి మరమ్మతు పనులు చేసేందుకు గత నెల 13వ తేదీ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేశారు. మే 12వ తేదీలోపు పనులు పూర్తి చేసి యథావిధిగా బ్రిడ్జిలో రాకపోకలు కొనసాగిస్తామని అధికారులు అప్పుట్లో వెల్ల డించారు. అధికారులు ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. ప్రస్తుతం బ్రిడ్జి మరమ్మతు పను లు చివరి దశలో ఉన్నాయి. రెండు రోజుల్లో పనులు పూర్తి చేసి రాకపోకలు కొనసాగిస్తామని అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం మరో అండర్ బ్రిడ్జ్ ద్వారా స్థానికులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రహదారిలో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరగా బ్రిడ్జి మరమ్మతు పనులను పూర్తి చేసి వాహనచోదకుల ఇక్కట్లు తొలగించాలని కోరుతున్నారు.
ముక్కంటి సేవలో
కర్ణాటక హైకోర్టు జడ్జి
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని మంగళవారం కర్ణాటక హైకో ర్టు జడ్జి శ్రీషానంద కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆలయాధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి, స్వామి అమ్మవార్ల జ్ఞాపిక అందజేశారు.


