ఏర్పేడు:ప్రతిష్టాత్మకమైన ఖేలో ఇండియా సంయుక్త కార్యదర్శి వినీల్‌కృష్ణ మంగళవారం తిరుపతి ఐసర్‌ను సందర్శించారు. ఆయనకు ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతాను భట్టాచార్య, ఐసర్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇంద్రప్రీత్‌సింగ్ కోహ్లీ జ్ఞాపిక అందజేసి, ఘనంగా సత్కరించారు. ఆయన పర్యటన సందర్భంగా ఐసర్ విద్యాసంస్థల్లో క్రీడలు, యువత సాధికారత, సంపూర్ణ అభివృద్ధి ప్రాముఖ్యతపై చర్చించారు. విద్యార్థుల్లో విద్య, పరిశోధన, ఫిట్‌నెస్, క్రీడా సంస్కృతిలో శ్రేష్టతను ప్రోత్సహించాలనే ఉమ్మడి దృక్పథాన్ని ఆయన పర్యటన ప్రతిబింబించిందని స్పష్టం చేశారు.


