● బరితెగిస్తున్న భూ మాఫియా ● నకిలీ పత్రాలు సృష్టించి రూ.కోట్లు విలువైన స్థలాల కబ్జా ● అడ్డుపడుతున్న ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ ● నిర్లక్ష్యధోరణిలో అధికార యంత్రాంగం | - | Sakshi
Sakshi News home page

● బరితెగిస్తున్న భూ మాఫియా ● నకిలీ పత్రాలు సృష్టించి రూ.కోట్లు విలువైన స్థలాల కబ్జా ● అడ్డుపడుతున్న ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ ● నిర్లక్ష్యధోరణిలో అధికార యంత్రాంగం

May 12 2026 5:48 AM | Updated on May 12 2026 5:48 AM

● బరితెగిస్తున్న భూ మాఫియా ● నకిలీ పత్రాలు సృష్టించి రూ.కోట్లు విలువైన స్థలాల కబ్జా ● అడ్డుపడుతున్న ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ ● నిర్లక్ష్యధోరణిలో అధికార యంత్రాంగం

సాక్షి టాస్క్‌పోర్స్‌: వెంకటగిరిలో భూ మాఫియా బరితెగిస్తోంది. పట్టణ నడిబొడ్డున ఉన్న రూ.కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేందుకు భూ ఆక్రమణదారులు పావులు కదుపుతున్నారు. కొందరు అధికారులతో కుమ్మకై ఏకంగా దశాబ్దాల క్రితం నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు, క్రీడా ప్రాంగణాలు సైతం వదలడంలేదు. సుమారు 20 ఎకరాలు విలువైన భూమిని కాజేసేందుకు పాలువులు కదుపుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు సైతం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఏర్పడి భూ ఆక్రమణలు జరగకుండా అడ్డుపడుతోంది. ఈ భూ వ్యవహారంపై గతంలో వెంకటగిరి తహసీల్దార్‌, శ్రీకాళహస్తి ఆర్డీఓ, తిరుపతి జిల్లా కలెక్టర్‌కు వేర్వేరు రూపాల్లో వినతి పత్రాలు సైతం సమర్పించారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఏ మాత్రం స్పందన రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఏస్‌లో స్థానిక ఎమ్మెల్యేకు సైతం వినతి పత్రం సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళ్లముందే రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణంలోని నడిబొడ్డులో ఉన్న మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా 1965వ సంవత్సరానికి పూర్వం సర్వే నంబర్‌ 199–3, 199–4,199–5,200–2లో తాలుకా సమితి కార్యాలయం కోసం ప్రభుత్వం 6.61 ఎకరాల భూమి కేటాయించింది. ఇందులో వసతి గృహానికి 3 ఎకరాలు పోను మిగిలిన 3 ఎకరాలను షేక్‌ అబ్దుల్‌ కరీం సాహెబ్‌, వెంకట సుబ్బయ్యల వారసులమంటూ దొంగ రికార్డులను సృష్టించి ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు పలు వి మర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 1974లో వెంకటగిరి రాజా నుంచి 18 ఎకరాలను ఆనాటి విశ్వోదయ కళాశాల యాజమాన్యం కొనుగోలు చేసినట్లు పలువురు పట్టణ వాసులు చెబుతున్నారు. ఇందులోనే భవనాలు కూడా నిర్మించారు. 1968వ సంవత్సరం నుంచి 2015వ సంవత్సరం వరకు ఆ భవనాలు, స్థలాన్ని విశ్వోదయ కళాశాల హాస్టల్‌ నిర్వహణకు ఉపయోగించారు. అయితే తాజాగా రెవెన్యూ శాఖలో లూప్‌లైన్స్‌ తెలుకుని అబ్దుల్‌ కరీం, వెంకటేశ్వరయ్య అనే పాత యజమానుల పేర్లతో ఆధారం చేసుకుని ఆ స్థలానికి సంబంధం లేని వ్య క్తులను వారసులుగా తెరపైకి తీసుకొస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఖాళీగా ఉన్న ఆ స్థలంలో గతంలో పనిచేసిన తహసీల్దార్‌ని ప్రలోభాలకు గురి చేసి నివాసాలు ఏర్పాటు చేసినట్లు అడంగల్‌లో తప్పు డు నివేదికను తయారు చేసినట్లు సమచారం. ఆ భూమి ప్రస్తుత మార్కెట్‌ల్లో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల విలువ చేస్తుందని పలువురు పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అమ్మవారిపేట చెరువు సర్వే నంబర్‌ 215 సర్వే నంబర్‌లోని 36 ఎకరాలు ఉండగా పదుల సంఖ్యలో చెరువు ఆక్రమణలకు గురైపోయింది. ఆ స్థలాల్లో భవనాలు సైతం నిర్మాణాలు చేపడినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నకిలీ వారసులను సృష్టించి కబ్జాకు యత్నం

Advertisement
 
Advertisement
Advertisement