జూనియర్‌ జడ్జిల బదిలీలు | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ జడ్జిల బదిలీలు

May 12 2026 5:48 AM | Updated on May 12 2026 5:48 AM

తిరుపతి లీగల్‌: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్‌ సివిల్‌ జడ్జిలను ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కొంతమంది జూనియర్‌ సివిల్‌ జడ్జిలకు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఉన్న ఎం.మాధవిని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎకై ్సజ్‌ న్యాయమూర్తిగా, చిత్తూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి షేక్‌ బాబాజాన్‌ను కడప జిల్లా మైదుకూరు మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా, పుత్తూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ సి.జానకిని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఐదో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ చేసినట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే శ్రీకాళహస్తి మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ కృష్ణప్రియను ప్రకాశం జిల్లా ఒంగోలు ఎకై ్సజ్‌ కోర్టు న్యాయమూర్తిగా, తంబళ్లపల్లి జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ ఉమర్‌ ఫరూక్‌ను కడప జిల్లా జమ్మలమడుగు అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా, తిరుపతి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వాణిశ్రీని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ అయ్యారు. తిరుపతి మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి సీకేవీ సత్య కాంత్‌ కుమార్‌ను నెల్లూరు జిల్లా ఉదయగిరి మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా, తిరుపతి రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి పి. కోటేశ్వరరావును కడప ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా, తిరుపతి మూడో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ ఎం సంధ్యారాణిని కర్నూలు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ చేశారు. కాగా తిరుపతి నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి గ్రంధి శ్రీనివాస్‌ను గుంటూరు జిల్లా తెనాలి రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా, తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌ శ్రీకాంత్‌ను కృష్ణాజిల్లా విజయవాడ రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే గుంటూరు ప్రత్యేక రైల్వే కోర్టు జడ్జిగా ఉన్న పి. రమాదేవిని తిరుపతి మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా, కృష్ణాజిల్లా, విజయవాడ ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఉన్న జి. లెనిన్‌ బాబును తిరుపతి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఉన్న పి. పరేష్‌ కుమార్‌ను చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. తిరుపతి మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జడ్జి రమాదేవి తిరుపతి మూడో, ఐదో, రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. తిరుపతి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా జీ లెనిన్‌ బాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుపతి రెండు, నాలుగు, చిత్తూరు ఎకై ్సజ్‌ కోర్టుల ఇన్‌చార్జి న్యాయమూర్తిగా వ్యవహరించాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. బదిలీ అయిన న్యాయమూర్తులు ఈనెల 18వ తేదీ లోపు బాధ్యతలు స్వీకరించాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement