నవోదయలో విశ్వం ఉత్తమ ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

నవోదయలో విశ్వం ఉత్తమ ఫలితాలు

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

తిరుపతి అర్బన్‌: జాతీయ స్థాయిలో 2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తిరుపతి విశ్వం విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. తాజాగా విడుదల చేసిన 11వ తరగతి ప్రవేశ పరీక్షలో విశ్వం విద్యార్థులు శ్రావ్య, రిచిత, ప్రవీణ్‌, గగన్‌ హర్ష, గణేశ్‌, హర్ష, హర్షిత, తనుష, కావ్య, అస్మా, లిఖిత, వరుణ్‌ సందేశ్‌, చరితార్థ, ప్రీతం, తేజస్వి, శ్రీదేవి తదితరులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను తిరుపతిలోని తమ విద్యాసంస్థలో సోమవారం విశ్వం విద్యా సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ ఎన్‌.విశ్వచందన్‌ రెడ్డి, సాయిగణేష్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ చెంచురెడ్డి అభినందించారు. అలాగే 6వ, 9వ తరగతి ప్రవేశ పరీక్షల్లో కే. గీతిక, సి.కార్తీక్‌, శ్రీహాన్‌రెడ్డి, పి.నిశాంత్‌, సి.హేమతేజ, హెచ్‌ అనన్య, ఎం.భావదీష్‌, ఆర్‌.నికోలస్‌ ఫ్రాంక్లిన్‌, కే.సిద్ధార్థ, బి.సాయి అభిరామ్‌, బి.హనీశ్రీ, ఎస్‌.ఎం.ఇలియాస్‌, కే. సాయికృష్ణ, లిఖిత, జోషిక తదితరులతో పాటు మొత్తం 56 మంది విశ్వం విద్యార్థులు నవోదయ విద్యాలయాలకు ఎంపికై నట్లు కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్‌. విశ్వనాథ రెడ్డి తెలిపారు. గత 36 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో నిర్వహించే సైనిక్‌ స్కూల్‌, నవోదయ, మిలిటరీ స్కూల్స్‌ పోటీ పరీక్షలకు విశ్వం విద్యా సంస్థలు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాయని తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి నవోదయ, సైనిక్‌, ఇతర రెసిడెన్షియల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్షల శిక్షణ వివరాల కోసం 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement