శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వం జరిగింది. సోమనాథస్వామి ఆలయం పునర్నిర్మాణం చేసి 75 ఏళ్లు కావడంతో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ అఖండ విశ్వాసం పేరుతో ముక్కంటి ఆలయంలో ఉత్సవం నిర్వహించారు. ఆలయంలో ఉదయం సోమనాథేశ్వరస్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. సోమనాథ సంకల్పం, సోమనాథ గీతాలాపన చేశారు. భక్తులకు ప్రసాద వితరణ, కళాకారుల భజన, కోలాటాలు, శివసేవకులు ఓం జెండాల ప్రదర్శన, మేళ తాళాల నడుమ సోమనాథేశ్వరస్వామి చిత్రపటంతో శోభాయాత్ర తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఈఓ బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు గుర్రప్పశెట్టి, హేమావతి పాల్గొన్నారు.


