ఇసుక లారీ మాయం? | - | Sakshi
Sakshi News home page

ఇసుక లారీ మాయం?

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

● మామూళ్ల మత్తులో మార్కెటింగ్‌ అధికారులు ● ఒక్కసారిగా పడిపోయిన అన్ని రకాల కాయల ధరలు ● రూ.70 వేల నుంచి రూ.25వేలకి పడిపోయిన బేనీషా ● రూ.25వేల నుంచి రూ.9వేలకు తోతాపురి ● రూ.30 వేల నుంచి రూ.14 వేలకు చందూర ● గగ్గోలు పెడుతున్న మామిడి రైతులు – 8లో

న్యూస్‌రీల్‌

నాయుడుపేట మండల పండ్లూరు వెంగమాంజపురంలో ఐదు రోజుల క్రితం పోలీసులు సీజ్‌ చేసిన లారీ మాయమైంది.

సిండికేట్‌గా మారిన మామిడి మండీ యజమానులు

సోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026

ఆశనిరాశల నడుమ మామిడి రైతులు ఊగిసలాడుతున్నారు. ఒక ఏడాది దిగుబడి బాగుంటే గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. మరో ఏడాది రేటు అధికంగా ఉంటే సక్రమంగా పంట చేతికందక దెబ్బతింటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తోటలు కళకళలాడుతున్నప్పటికీ ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు మండీ యజమానుల మాయాజాలమే కారణంగా ఆరోపిస్తున్నారు. సిండికేట్‌గా మారి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామూళ్ల మత్తులో మార్కెటింగ్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

దామలచెరువు, తిరుపతి, చిత్తూరు,

బంగారుపాళెం, పాకాల, పుత్తూరు

చందూర

నిలువు దోపిడీపై ఆగ్రహం

ఏడాది పాటు మామిడి చెట్లను సంరక్షించుకుంటూ, వివిధ రకాల వాతావరణ సమస్యలను ఎదుర్కొని, చీడపీడలకు రూ.లక్షలు ఖర్చుచేసి పండించిన పంటకు యజమానులైన తాము ధరను నిర్ణయించే స్థితిలో లేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మార్కెట్‌ యార్డ్‌ వ్యాపారులు నిలువునా దోచుకొంటున్నారని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్‌ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని ఆక్రోశిస్తున్నారు. అధికారులు సైతం మామూళ్లు దండుకుని తమను రోడ్డుపాలు చేస్తున్నారని వాపోతున్నారు. రైతుల పక్షాన నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. కనీసం జ్యూస్‌ ఫ్యాక్టరీలను త్వరగా తెరిపిస్తే నేరుగా సరుకును అమ్ముకొనే అవకాశం కలుగుతుందని కోరతున్నారు. ఆదిశగా అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రేడింగ్‌ చేస్తున్న కూలీలు

పుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట మామిడి. సుమారు 2.65 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 70శాతం నుంచి 75 శాతం వరకు పంట దిగుబడి రావడంతో రైతులు కొంత ధైర్యంగా కోతలకు ఉపక్రమించారు. అయితే 10 రోజుల వ్యవధిలో ఒక్కసారిగా మామిడి ధరలు పతనమవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మార్కెట్‌ యార్డుల నుంచి వివిధ రకాల మామిడిని తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, గుజరాజ్‌, ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. దీంతో మామిడి సీజన్‌ ప్రారంభంలో ధర ఆశాజనకంగా ఉంటుంది. అందులో భాగంగానే సీజన్‌ ప్రారంభంలో బేనీషా టన్ను ధర రూ.70 వేలు పలకగా, ప్రస్తుతం రూ.25 వేలకి పడిపోయింది. జిల్లా మొత్తం మీద మామిడి దిగుబడిలో 75 శాతంతో అగ్రభాగాన నిలిచే తోతాపూరి తొలుత టన్ను ధర రూ.25 వేల నుంచి రూ.30 వేలు పలికింది. అయితే ప్రస్తుతం రూ.9 వేలకు తగ్గిపోవడంతో రైతులు నివ్వెరపోతున్నారు. అలాగే చందూర రూ.30 వేల నుంచి రూ.14 వేలకి పడిపోయింది. దీనిపై ప్రశ్నించిన రైతులకు నెల్లూరు, విజయవాడ మార్కెట్లలో డిమాండ్‌ తగ్గిందని వ్యాపారులు కుంటి సాకులు చెబుతున్నారు. సాధారణంగా పల్ప్‌ ఫ్యాక్టరీలు తెరవక ముందు తోతాపూరి ధరలు ఆశాజనకంగా ఉంటాయి. ఫ్యాక్టరీలు తెరిచాక అన్ని ప్రాంతాల నుంచి సరుకు ఎక్కువగా రావడం వల్ల కాస్త ధర తగ్గడానికి అవకాశముంటుంది. ఓ పక్క ఫ్యాక్టరీలు తెరవక ముందే తోతాపూరితో పాటు అన్ని రకాలకు ధరలను సగానికి సగం తగ్గించేశారు. దీంతో మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement