‘ధ్రువీకరణ’కు ఇదే సమయం | - | Sakshi
Sakshi News home page

‘ధ్రువీకరణ’కు ఇదే సమయం

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

సర్టిఫికెట్ల దరఖాస్తుకు చొరవ తీసుకోండి

విద్యా సంవత్సరం మొదలైతే జాప్యం తప్పదు

హడావుడి ఆందోళనకు స్వస్తి పలకండి

విద్యార్థులు, తల్లిదండ్రులకు

అధికారుల సూచన

తిరుపతి అర్బన్‌ : పదోతరగతి, ఇంటర్‌ ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. జూన్‌లో ఇంజినీరింగ్‌, పీజీ తదితర కోర్సులతోపాటు నీట్‌ ఫలితాలు రానున్నాయి. ఈ క్రమంలోనే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రతి విద్యార్థికీ నూతన కోర్సులో ప్రవేశం పొందేందుకు పలు సరిఫికెట్లు అవసరం. కోర్సులో చేరే సమయంలో ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఎక్కువ మంది విద్యార్థులు, తల్లిదండ్రులు సచివాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయాలకు పరుగులు తీస్తుంటారు. వెంటనే తమకు సర్టిపికెట్లు మంజూరు చేయాలని అధికారులను ఒత్తిడి చేస్తుంటారు. ఆలస్యమైతే ఆందోళనకు గురవుతుంటారు. అలాగే హడావుడి నేపథ్యంలో సర్టిఫికెట్లలో పలు తప్పులు సైతం దొర్లుతుంటాయి. దీంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది.

ముందస్తే మంచిది

అకడమిక్‌ ఇయర్‌ ఆరంభమయ్యే వరకు వేచి ఉండకుండా, అవసరమయ్యే సర్టిఫికెట్లకు ఈ నెలలోనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ముందస్తుగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా సకాలంలో సర్టిఫికెట్‌ జారీ అవుతుందని వెల్లడిస్తున్నారు. ఆఖరి క్షణం వరకు ఆందోళన చెందే ప్రమాదం తప్పుతుందని తెలియజేస్తున్నారు. ఏటా జూన్‌, జూలై, ఆగస్ట్‌లో ఒక్క తిరుపతి అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయానికే వివిధ సర్టిఫికెట్ల కోసం లక్షకు పైగా దరఖాస్తులు వస్తుంటాయని వివరిస్తున్నారు. ఈ మేరకు ముందు జాగ్రత్తగా కుల, ఈడబ్ల్యూఎస్‌, ఆదాయ, నివాస, ఓబీసీ, ఆధార్‌, రేషన్‌ కార్డుల్లో తప్పుల సవరణ, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. దీంతో ప్రశాంతంగా ఎలాంటి తప్పులు లేకుండా ఇబ్బండి పడపత్రంతోపాటు ఈడబ్ల్యూఎస్‌, ఆదాయ, నివాస, ఓబీసీ, ఆధార్‌, రేషన్‌కార్డుల్లో తప్పుల సవరణ, పలు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను తీసుకోవడానికి దరఖాస్తులు చేసుకుంటే ప్రశాంతంగా తప్పులు లేకుండా, ఇబ్బందులు పడకుండా సర్టిఫికెట్లు పొందే వెసులుబాటు ఉంటుందని వెల్లడిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement