మామిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలడానికి వ్యాపారులతో పాటు అధికారులు కుమ్మక్కు కావడమే ప్రధాన కారణం. ధరలను ఇష్టారాజ్యంగా ప్రకటిస్తున్న వ్యాపారులపై మార్కెటింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఆదిశగా తనిఖీలు చేయడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. – టి.కేశవులు, అధ్యక్షుడు,
మామిడి రైతు సొసైటీ, పుత్తూరు
కఠిన చర్యలు తప్పవు
జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను నియంత్రిస్తే కఠిన చర్యలు తప్పవు. మార్కెట్ యార్డుల్లోని సెక్రటరీలు ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ధరలను నియంత్రించే వ్యాపారులను యార్డు నుంచి తొలగిస్తాం. వారి లైసెన్సులను సైతం రద్దు చేస్తాం.
– టి.సురేంద్రబాబు,
ఏడీ, మార్కెటింగ్, తిరుపతి


