వెంకటగిరి రూరల్ : విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టర్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధంగా ఉండాలని విద్యుత్ యూనియన్ నేతలు పేర్కొన్నారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ యూనియన్ జిల్లా ప్రథమ మహాసభ పట్టణంలోని పింజల వీరయ్య కల్యాణ మండపంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత పట్టణంలోని క్రాస్‌రోడ్డు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దుగ్గిరాల సూరిబాబు, సుదర్శన్‌రెడ్డి, జేఎల్‌ఎం గ్రేడ్–2 రాష్ట్ర కన్వీనర్ పెంచల ప్రసాద్, నెల్లూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హసరత్తయ్య, జాకీర్ హుస్సేన్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం నూతన కమిటీ ఏర్పాటు చేశారు.
నూతన కమిటీ సభ్యులు
జిల్లా గౌరవ అధ్యక్షుడిగా మస్తానయ్య, జిల్లా అధ్యక్షుడిగా కిరణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా నాదమునిరెడ్డి, కోశాధికారిగా పురుషోత్తం, వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీ, చీఫ్ అడ్వైజర్‌గా, ఆఫీసు బైరర్స్‌గా జ్యోతి, ఏడుకొండలు బాబు, సిహెచ్ నారాయణ, రవీంద్ర, వెంకటరమణ, జగదీశ్వర్‌రెడ్డి, ప్రసాద్, ఎల్ లక్ష్మణ రావు, నాగూరుబాబు, మునిశేఖర్, తేజ ఎంపికయ్యారు. కాంట్రాక్టర్ కార్మికుల నూతన కమిటీ అధ్యక్షులుగా సుబ్రమణ్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ హేమకుమార్, ఉపాఽధ్యక్షులుగా సుబ్రమణ్యం, చిరంజీవి, ఎస్‌కే ఆసిఫ్ రవి, వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా కుమార్ , తదితర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్ కార్మికుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్పీడీసీఏల్ ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యంరాజు, జిల్లా నాయకులు నాగయ ఈటే కొండయ్య, గిరి, మజార్, సునీల్ పాల్గొన్నారు.
టీడీపీ నేత పోస్టింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు?
కలువాయి(సైదాపురం): మండలంలోని కుల్లూరు గ్రామంలో జరుగుతున్న రీ సర్వేపై టీడీపీ నేత ఒకరు సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ గ్రూపుల్లో పోస్టింగ్ పెట్టారు. దీనిపై వీఆర్వోలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల కథనం ప్రకారం, కుల్లూరు గ్రామంలో రీ సర్వేలో రెవెన్యూ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పతున్నారని, పెద్ద పెద్ద రైతుల తోటల్లో లిక్కర్ పార్టీల్లో వీఆర్‌ఓ, సర్వేయర్ పాల్గొని, భూ మార్పిడి చేస్తున్నారని, 400 ఎకరాల వరకు గోల్‌మాల్ జరిగినట్లు ఈనెల 5న టీడీపీ నేత పోస్టింగ్ పెట్టారు. ఈ పోస్ట్‌పై కుల్లూరు, వెంకటరెడ్డిపల్లి, వీఆర్వోలు కలువాయి పోలీసు స్టేషన్‌ల్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.


