ఏర్పేడు: తిరుపతి ‘భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ(ఐసర్)’ శాశ్వత ప్రాంగణంలో ప్రతి నిర్మాణం విజ్ఞానాన్ని అందించేలా అను భవ పాఠం నేర్పుతోంది. ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్‌లో కొలీజియం(ఆడిటోరియం) భవనానికి రసాయన ఫార్ములాలను అరలు లాగా అమర్చడంతో కొత్తగా ఐసర్‌ను చూసేందుకు వచ్చిన వారు వినూత్నంగా కనిపిస్తున్న ఈ భవనాన్ని చూసి అబ్బురపడుతున్నారు. దాని సమీపంలో ఉన్న సైన్స్ ప్రయోగ భవనాలను విభిన్న ఆకృతులు, దేశంలో పేరెన్నిక గల సైన్స్ నిపుణులు, శాస్త్రవేత్తల పేర్లు, వివిధ సైన్స్ ఫార్ములాలను రాయడం, భవనాల ఆకృతులు కూడా విభి న్నంగా కనిపిస్తున్నాయి.
వ్యాసాశ్రమంలో
అక్రమాలపై ఫిర్యాదు
ఏర్పేడు: ఏర్పేడు సమీపంలోని శ్రీవ్యాసాశ్రమంలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఆశ్రమ పూర్వ విద్యార్థుల సంఘం భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినట్లు వెల్లడించారు. ఆశ్రమంలో వ్యవస్థాపకులు సద్గు రు మలయాళ స్వామి ఆశయాలకు అనుగుణంగా పాలన జరగడం లేదని అందులో పేర్కొన్నా రు. చిత్తూరులోని వ్యాసాశ్రమానికి చెందిన ప్రింటింగ్ ప్రెస్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారని ఆరోపించారు. ఆశ్రమంలో భక్తులను లో పలికి రానివ్వకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేశారని, ఆశ్రమంలో గతంలో ఉన్న వేదవిద్య, కంటి వైద్యశాల వంటివి మూతవేశారన్నారు. ఆశ్రమంలో నిధులను నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేసి దుర్వినియోగం చేస్తున్నారని, వారిపై విచారించి చర్యలు తీసుకోవాలని పూర్వ విద్యార్థులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ లేఖను పంపినట్లు తెలిపారు.
శ్రీవారి సేవలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్
తిరుమల: భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ దంపతులు శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వదించారు. అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు.
అమ్మవారి సేవలో కేంద్ర ఎన్నికల అధికారి
చంద్రగిరి: కేంద్ర ఎన్నికల అధికారి గ్యానేష్ కుమార్ దంపతులు శనివారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆలయ ధ్వజస్తంభం వద్ద మొక్కుకుని, అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.


