గంగమ్మకు తిరుమల వెంకన్న సారె | - | Sakshi
Sakshi News home page

గంగమ్మకు తిరుమల వెంకన్న సారె

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

తిరుపతి కల్చరల్‌: తాతయ్యగుంట గంగమ్మకు శనివారం శ్రీవారి సారె సమర్పించారు. టీటీడీ తరఫున పోటు ఏఈఓ గుండ్లూరు మునిరత్నం తిరుమలలోని శ్రీవారి ఆలయం నుంచి అర్చకులు, అధికారులు సారెను గోవిందరాజస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ ఆలయంలో శ్రీపుండరీకవల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణల మధ్య శోభాయాత్రగా గంగమ్మ ఆలయానికి సారెను తీసుకెళ్లి ఆలయ అర్చకులకు శేషవస్త్రాలు, పసుపు, కుంకుమ వంటి సారెను అందజేశారు.

గంగమ్మకు టీటీడీ ఉగ్యోగులు సారె

తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా శనివారం టీటీడీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వీ పవన్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ మణికంఠ, కోశాధికారి రేఖ, భరత్‌, శివ, ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చీర్ల కిరణ్‌, టీటీడీ ఉద్యోగుల సంఘం నేతలు రమాదేవి, మదన్‌మోహన్‌, చిన్నంగారి సూరిబాబు, ఆంజనేయులు పాల్గొన్నారు. అలాగే బాలాజీ రైల్వే డివిజన్‌ సాధన సమితి కన్వీనర్‌ కుప్పాల గిరిధర్‌కుమార్‌ కుటుంబ సమేతంగా శనివారం గంగమ్మ తల్లికి సారెను సమర్పించారు. అనంతరం జాతర ఏర్పాట్ల నిమిత్తం ఆయన రూ.25 వేలు నగదును ఆలయ చైర్మన్‌ నైనాన్‌ మహేష్‌యాదవ్‌కు అందజేశారు. తరువాత శాప్‌ చైర్మన్‌ రవి నాయుడు గంగమ్మ తల్లి జాతర నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షలు విరాళాన్ని ఆలయ చైర్మన్‌ మహేష్‌యాదవ్‌కు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement