ఏర్పేడు: మండలకేంద్రానికి సమీపంలో శనివారం రా త్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏర్పేడుకు చెందిన వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్‌రెడ్డి కథనం మేరకు.. మండల కేంద్రంలోని కమ్మవీధికి చెందిన వంకాయలపాటి కరుణాకర్‌నాయుడు(65) జాతీయ రహదారి పక్కన ఉన్న తన పొలానికి మట్టి తోలించడానికి వెళ్లి తిరిగి ఇంటికి బైక్‌పై వస్తుండగా, ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ప్రమాదాన్ని తప్పించబోయే క్రమంలో శ్రీకాళహస్తి వైపు వెళుతున్న లారీ అదుపు తప్పి లారీలో ఉన్న పెద్ద గ్రానైట్‌రాయి మృతుని పక్కన పడింది. దీంతో కరుణాకర్‌నాయుడికి బలమైన గాయం కావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బైక్‌ను ఢీకొన్న బైక్‌పై వెళుతున్న యువకుడి కాలు విరగగా, తలకు గాయమైంది. దీంతో క్షతగాత్రుడిని తిరుప తి రుయాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐ రవిప్రకాష్ తెలిపారు.


