రాపూరు:మండలంలోని పెంచలకోన క్షేత్రం శనివా రం భక్తులతో కిక్కిరిసింది. బ్రహ్మోత్సవాల అనంత రం వచ్చే మొదటి శనివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెనుశిల లక్ష్మీనరసింహాస్వా మి, ఆదిలక్ష్మీదేవి, ఆంజనేయస్వామివారిని దర్శించు కుని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం 4 అభిషేకం, 5 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు పూలంగిసేవ నిర్వహించారు. 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నిత్యకల్యాణ మండలంలో కొలు వు దీర్చి, విశేషాలంకరణ చేసి, శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ఊజంల్‌సేవ చేశారు.


