తిరుపతిలోని కూటమి ముఖ్య నేతలు డివిజన్ల కోసం పట్టుపడుతున్నారు. ఎవరూ ఎవరి మాటను లెక్కచేయకపోవడంతో టీడీపీ, జనసేన ఎవరికి వారు డివిజన్లను పంపకాలు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మూడు నెలల కిందట సమావేశమైనప్పుడు ముఖ్యమైన నాయకుల్లో ఒక్కొక్కరు ఐదు డివిజన్ల చొప్పున బాధ్యతలు తీసుకోవాలని మాట్లాడుకున్నట్లు తెలిసింది. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ 20 డివిజన్లు తనకే అప్పగించాలని పట్టుబట్టినట్లు ఆమె వర్గీయులు చెబుతున్నారు. ఇకపోతే నరసింహయాదవ్ 10 నుంచి 15 డివిజన్లు అడిగినట్లు చెబుతున్నారు. అన్నా రామచంద్రయాదవ్ ఐదు డివిజన్లు అడిగారని ప్రచారం జరిగింది. అయితే మబ్బు దేవనారాయణరెడ్డి నగరంలోని అన్ని డివిజన్ల బాధ్యత తనకు అప్పగిస్తే అభ్యర్థులందరినీ గెలిపించుకొస్తానని చెప్పినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. అలాగే జేబీ శ్రీనివాసులు అడిగినట్లు తెలిసింది. ఇందులో జనసేనకు ఎన్ని అనే ప్రస్తావన రాలేదని సమాచారం. ఎందుకంటే ఆ సమావేశంలో జనసేన ముఖ్యనేతలు లేరని తెలిసింది.


