టీడీపీ మూకలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ మూకలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

– మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరిక

తిరుపతి తుడా: రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న టీడీపీ మూకలు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ దశరథరామిరెడ్డిని శుక్రవారం రోజా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాయచోటిలో మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి భూ దందాలు, రౌడీయిజం, గంజాయి అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. రామ్‌ప్రసాద్‌రెడ్డి రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, వారికి ఇదే పరిస్థితి భవిష్యత్‌లో ఎదురవుతుందన్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా దాడి చేయడంపై ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైందన్నారు.

వంటగ్యాస్‌ లీక్‌.. ఐదుగురికి గాయాలు

డక్కిలి: వంటగ్యాస్‌ లీక్‌ కావడంతో ఐదుగురు గాయపడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు కథనం మేరకు.. మండలంలోని దగ్గవోలు గ్రామానికి చెందిన బొడుగు జయమ్మ ఇంట్లో వంటగ్యాస్‌ లీకై ంది. వంట గ్యాస్‌ లీకై న సంఘటన గమనించిన జయమ్మ పక్కింటివారితోపాటు స్థానికులు, సమీప ప్రాంతంలో ఉన్న వారికి ఈ విషయం తెలియజేసింది. దీంతో పక్కింట్లో ఉన్న వీరపు వెంకటేశ్వర్లు భార్య మంజులతోపాటు బోడుబోయిన సుబ్రమణ్యం, పాడి ప్రసాద్‌ తదితరులు జయమ్మ ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ గ్యాస్‌ లీకై ఉండడంతో గ్యాస్‌ను నివారించేందుకు ఆతృతగా గ్యాస్‌ రెగ్యులేటర్‌ను సరిచేశారు. తర్వాత గ్యాస్‌ను వెలిగించే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. ఈ ప్రమాదంలో ఇంటి యజమాని జయమ్మ, వెంకటేశ్వర్లు, మంజుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రసాద్‌, సుబ్రమణ్యం స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో చికిత్స నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వాస్పత్రిలో తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement