వ్యాక్సినేషన్‌ కార్యక్రమం తనిఖీ | - | Sakshi
Sakshi News home page

వ్యాక్సినేషన్‌ కార్యక్రమం తనిఖీ

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

సూళ్లూరుపేట రూరల్‌: మండలంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మహిళలకు శుక్రవారం నిర్వహించిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని డీఎంచ్‌ఓ బాలకృష్ణానాయక్‌ తనిఖీ చేశారు. మండలంలోని కుదిరి, 104 వాహనం మందులు, షార్‌లోని గిరిజన కాలనీలను ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు ఈ వ్యాక్సిన్లను వేసినట్లు అధికారులు తెలిపారు. వైద్యులు జయశ్రీదేవి, ఐ. రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

నాయుడుపేట టౌన్‌: మండలంలోని నరసారెడ్డికండ్రిగ వద్ద శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్‌ఐ నాగేశ్వరరావు కథనం మేరకు.. నరసారెడ్డికండ్రిగ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అ క్కడికక్కడే మృతిచెందినట్లుగా స్థానికులు గుర్తించారు. అయితే మృతదేహంపై అనేక వాహనాలు వెళ్లడంతో శరీర భాగాలు చిందరవందర కావడంతో ఆనవాళ్లు గుర్తుపట్టలేనంతగా మారాయి. సు మారు 35 ఏళ్ల వ్యక్తి శరీరంపై ఎలాంటి దుస్తులు లేవని, కేవలం డ్రాయిర్‌ మాత్రమే ఉందని ఏ ఎస్‌ఐ తెలిపారు. డేవిడ్‌ అనే అంబులెన్స్‌ డ్రైవర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై పడి ఉన్న శరీర భాగాలను గోనెసంచిలో వేసి పోలీసులకు అప్పగించడంతో వారు ఆ మృతదేహాన్ని మార్చరీలో భద్రపరిచినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement