10 నుంచి తిరుచానూరు–నాందేడ్ వీక్లీ
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ప్రయాణికుల రద్దీని దృష్ట్యా తిరుపతి మార్గంలో నడిచే మరో మూడు రైళ్లను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ తెలిపారు. ఇందులో నాందేడ్ – తిరుచానూర్, తిరుపతి–పంఢరాపూర్, జాల్నా – తిరుచానూరు రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. రైలు నెంబర్ 17637 జాల్నా– తిరుచానూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 11 నుంచి ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు జాల్నాలో సోమవారం ఉదయం 7 గంటలకు బయలుదేరి రాత్రి 9.10 గంటలకు చర్లపల్లికి, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు తిరుచానూరుకు చేరుకుంటుంది.
రైలు నెంబర్ 17638 తిరుచానూరు – జాల్నా వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తిరుచానూరులో మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.15 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. జాల్నా, తిరుచానూర్ మధ్య నడిచే రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో వికారాబాద్, లింగంపల్లి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. రైలు నెంబర్ 17636 నాందేడ్ – తిరుచానూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు నాందేడ్‌లో శనివారం మధ్యాహ్నం 4.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు విజయవాడకు, మధ్యాహ్నం 12.20 గంటలకు తిరుచానూరుకు చేరుకుంటుంది.
ప్రత్యేక రైలు
రైలు నెంబర్ 17634 తిరుచానూరు – నాందేడ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 10 నుంచి ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తిరుచానూరులో ఆదివారం రాత్రి 7.45 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు వేకువజామున 2.40 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. నాందేడ్, తిరుచానూర్ మధ్య నడిచే ఈ వీక్లీ ట్రైన్స్ తెలుగు రాష్ట్రాల్లో బాసర, నిజామాబాద్, కోరుట్ల, లింగంపేట్ జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. తిరుపతి, పంఢరాపూర్ మధ్య నడిచే రైళ్లు రేణిగుంట, రాజంపేట, కడప, యరగ్రుంట్ల, తాడిపత్రి, గుత్తి, ధోనే, కర్నూలు సిటీ, గద్వాల్, వనపర్తి రోడ్, మహబూబ్నగర్, షాద్నగర్, కాచిగూడ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్ స్టేషన్లలో ఆగుతాయి.


