శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

తిరుమల:తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టి స్‌ తిరుమల దేవి గురువారం తిరుమలలో శ్రీవారి ని దర్శించుకున్నారు. వీరికి ఆలయాధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు పలకగా, టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.

ప్రభుత్వ భూమి కబ్జా

కలువాయి(సైదాపురం): మండలంలోని వెంకటరెడ్డిపల్లి జాతీయ రహదారి కూడలిలో ప్రభుత్వ భూమిని కొందరు కూటమి నాయకులు కబ్జా చేసి, రెవెన్యూ అధికారులు పెట్టిన ప్రభుత్వ బోర్డును సైతం తొలగించి అక్రమ నిర్మాణాల కోసం రంగం సిద్ధం చేశారు. విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న, ప్రభుత్వ భూమి అని అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన లెక్క చేయకుండా నిర్మాణం చేపట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బోర్డు తొలగించి, ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement