తిరుపతి ఎడ్యుకేషన్ : అన్నమయ్య సర్కిల్లో ప్రభుత్వ గ్రేడ్–1 గ్రంథాలయంలో ఏప్రిల్ 28 నుంచి జూన్ 6వ తేదీ వరకు ఏర్పాటు చేసిన ఉచిత వేసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి తెలిపారు. వేసవి శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో 5 నుంచి పదో తరగతి విద్యార్థులకు యోగ, ధ్యానం, డ్రాయింగ్, పెయింటింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, ఇంగ్లిష్ గ్రామర్, కథలు చెప్పడం, చెప్పించడం, కంప్యూటర్ పరిచయం, ఇంటర్నెట్ వినియోగం, క్రాఫ్ట్ వర్క్స్, తెలుగు పద్యాలు, తెలుగు గ్రామర్, వ్యక్తిత్వ వికాసం, జనరల్ నాలెడ్జ్ లోఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయాధికారి జె.శివప్రసాద్ పాల్గొన్నారు.


