పోరాటం ఉధృతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పోరాటం ఉధృతం చేయాలి

May 7 2026 9:38 AM | Updated on May 7 2026 9:38 AM

ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు

వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం నేతల సమావేశంలో ప్రముఖుల వెల్లడి

చంద్రబాబు పుట్టిన ఊరినే కాదు..రాయలసీమను కరువుసీమగా మార్చి, రైతులను కన్నీళ్లు పెట్టించి పైశాచిక ఆనందాన్ని పొందే చంద్రబాబు ద్రోహాన్ని సీమ జిల్లాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రబాబు చేసిన మోసాన్ని చెప్పాలి. ఇది కేవలం నీటి సమస్యగా మాత్రమే చూడవద్దు. ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభం కావాలి.. లేదంటే పోరాటం ఉదృతం చేయాలి.

–చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ

చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త

తిరుపతి రూరల్‌: ‘జగనన్న పాలనలో 90 శాతానికి పైగా పనులు పూర్తి అయిన రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ఆపివేసింది చంద్రబాబే అన్న నిజాన్ని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.. స్వప్రయోజనాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తెలంగాణ రాష్ట్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించి ప్రజా ఉద్యమానికి ఊపిరిపోయాలి.’ అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ అన్నారు. భాకరాపేట సమీపంలోని లేక్‌వ్యూ రిసార్ట్స్‌లో ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం – చంద్రబాబు మోసం’ అన్న అంశంపై వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన విద్యార్థి విభాగం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మోసాలు బట్టబయలయ్యాయని అన్నారు.

కరువుసీమగా మార్చేందుకే బాబు కుట్ర

Advertisement
 
Advertisement
Advertisement