సత్యవేడు: స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో కంటి పరీక్షకు టార్చిలైటు ఒక్కటే వైద్య పరికరంగా కంటి వైద్యుడు సేవలందిస్తున్నారు.ీ స్థానిక సీహెచ్‌సీలో కంటి పరీక్షలకు వైద్యపరికరాలు లేవు. డాక్టర్ టార్చిలైట్‌తో కంటిపొరలను పరీక్షించి, మందులు రాసి ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ‘ముఖ్యమంత్రి ఐ కేంద్రాన్ని’ సత్యవేడు సీహెచ్‌సీలో ఏర్పాటు చేశారు. అప్పట్లో అపోలోకు కాంట్రాక్టు ఇచ్చారు. కంటి పరీక్షలకు అవసరమైన పరికరాలన్నీ కాంట్రాక్టర్ స్థానిక వైద్యశాలలో కంటి పరీక్షలకు అవసరమైన అన్ని పరికరాలు సమకూర్చారు. గత ఐదేళ్లు పేదలకు కంటి పరీక్షలు సక్రమంగా నిర్వహించి, ఉచితంగా కంటి అద్దాలు ఇచ్చేవారు. కాంట్రాక్టు ముగియడంతో కాంట్రాక్టర్ అన్ని పరికరాలు తీసుకెళ్లడంతో గదులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సత్యవేడు వైద్యశాల లో కంటి పరీక్షకు టార్చిలైట్ ఒక్కటే పరికరంగా డాక్టర్ వినియోగిస్తున్నారు. వైద్యశాలో 12 పోస్టులకు 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనస్తీషియా, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసన్, గైనకాలజిస్టు ఇద్దరికి ఒకరే ఉన్నా రు. రోజు వారీ 300 నుంచి 350 వరకు ఓపీ పేషెంట్లు వస్తున్నారు. వైద్యశాలకు పలు రకాల మాత్రలు, మందులు సరఫరా కావడంలేదు. వసతి నామమాత్రంగా ఉంది. డెలివరీలు నెలలో 10 చేస్తున్నారు. పెద్ద ఆపరేషన్ 1, కుటుంబనియంత్రణ ఆపరేషన్లు వారంలో నాలుగు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అందినన్ని రకాల వైద్యసేవలు నేడు అందడంలేదు. ప్రస్తుతం పేదవాడకి మెరుగైన వైద్యం అందడంలేదు.


