తిరుపతి అర్బన్: వికలాంగ యువతకు ఉద్యోగ ఆధారిత వెల్డింగ్ శిక్షణ ఈ నెల 10న శ్రీసిటీలో నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హి జ్రా, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు బి. వినోద్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, శ్రీసిటీ సంయుక్తంగా వర్డల్ బ్యాంక్ ఆర్‌ఏఎంపీ ప్రాజెక్టు ద్వారా 3–6 నెలలు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నివాస సౌకర్యం, ప్రాక్టికల్ శిక్షణ, వందశాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. 18–35 ఏళ్ల వికలాంగ యువత(సీ్త్ర, పురుషులు) అర్హులుగా పేర్కొన్నారు. పదో తరగతి లేదా ఇంటర్ చదువుకుని ఉండాలని చెప్పారు. అదనపు సమాచారం కోసం వాటాప్స్ నంబర్ 99596 10777లో సంప్రదించాలన్నారు.
సముద్రనాచు సాగుకు ఒప్పందం
తిరుపతి అర్బన్: పులికాట్ సరస్సు పరిసర ప్రాంతాల్లో సముద్రనాచు సాగుకు కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ నేతృత్వంలో గ్రీన్ క్లైమేట్ ఫండ్(జీసీఎఫ్) ప్రాజెక్టు ఆధ్వర్యంలో సముద్ర నా చు సాగును ప్రోత్సహిస్తూ త్రైపాక్షిక అవగా హన ఒప్పందం కుదుర్చుకున్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో మత్స్యశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం, ఆర్‌ఈఏడీఎస్ ఎన్‌జీఓ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. వాకాడు మండలంలో 50 ఫైలట్ సముద్ర నాచు యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. మత్స్యశాఖ జిల్లా అధికారి రాజేష్, డీఆర్‌డీఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభావతి, ఆర్‌ఈఏడీఎస్ సంస్థ ప్రతినిధి కట్టా వందనం పాల్గొన్నారు.
దివ్యాంగుల సొమ్ము
మింగేశాడు!
తిరుపతి అర్బన్: దివ్యాంగుల సొమ్మును విభి న్న ప్రతిభావంతులు, హిజ్రా, వయోవృద్ధుల సహాయ సంచాలకులు బి. వినోద్ దోచు కున్నారని దివ్యాంగుల సంఘం నేతలు మండిపడుతున్నారు. ది వ్యాంగులకు అవగాహన సదస్సుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన రూ. కోటి పైగా అవినీతి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు మంగళవారం దివ్యాంగుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళి, నాయకులు మురళీగౌడ్, సుధాకర్, సుచేంద్ర, పద్మావతి కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ గోవిందరావుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆ శాఖ ఏడీ వినోద్‌ను వివరణ కోరగా తాను ఏ తప్పు చేయలేదన్నారు. పైసా కూడా అవినీతికి పాల్పడలేదని చెప్పారు.


