పాలిసెట్‌లో ఉత్తమ ర్యాంకులు | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌లో ఉత్తమ ర్యాంకులు

May 6 2026 8:55 AM | Updated on May 6 2026 8:55 AM

– వందశాతం అర్హత సాధించిన విశ్వం విద్యార్థులు

తిరుపతి అర్బన్‌:తమ సంస్థల్లో శిక్షణ పొందిన విద్యార్థులు పాలిసెట్‌ –2026లో ఉత్త మ ర్యాంకులు సాధించారని విశ్వం విద్యా సంస్థల అధినేత, కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌.విశ్వనాథ్‌ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన మా ట్లాడుతూ తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం విద్యా సంస్థల్లో 2026 సంవత్సరం పాలిటెక్నిక్‌ ఎంట్రెన్స్‌కు శిక్షణ పొంది న విద్యార్థులు 100 శాతం అర్హత సాధించారని చెప్పారు. తమ విద్యార్థి వెల్దుర్తి మోక్షిత్‌ 120కి 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు, ఎస్వీయూ రీజియన్‌లో నూ, జిల్లాలో స్థాయిలోనూ మొదటి ర్యాంకు దక్కించుకున్నారని వెల్లడించారు. అలాగే జీ. భరణి 120కి 118 మార్కులు, మునిశంకర్‌, బి. హర్షిత్‌, కే. హర్షవర్ధన్‌, ఎన్‌.హాసిని, కే.పవ్యశ్రీ తదితరులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు. అలాగే 2026 సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో విశ్వం టాలెంట్‌ స్కూల్‌ విద్యార్థిని కే. గీతిక 300 మార్కులకు 285 మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రథమ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వం విద్యా సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ ఎన్‌. విశ్వచందన్‌ రెడ్డి, కరస్పాండెంట్‌ తులసి విశ్వనాథ్‌ రెడ్డి, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. పోటీ పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement