తిరుపతి అర్బన్: కార్గిల్ యుద్ధం భారతదేశ శక్తిని చాటిందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. లెఫ్టినెంట్ జనరల్ వెంకటేశ్‌రెడ్డి నేతృత్వంలో 27వ కార్గిల్ విజయ్ దివస్‌తోపాటు ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన క్రమంలో 21 మంది వెటరన్స్ బృందంతో విజయ్ అమృత్ కలశ్‌యాత్రకు శ్రీకారం చుట్టడం అ భినందనీయమన్నారు. ఈ యాత్ర సోమవారం తి రుపతికి చేరడంతో కలెక్టరేట్ వద్ద వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన అమర వీరులకు నివాళులర్పించారు. అలాగే విజయ అమృత్ కలశాలపై పుష్పాలు సమర్పించి, అమరవీరులకు జోహార్లు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విజయ్ అమృత్ కలిశ్ యాత్రలో తాను భాగమైనందుకు తనకు చాలా గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. చి త్తూరు ఎంపీ ప్రసాద్‌రావు మాట్లాడుతూ మన సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడి విజయం సాధించారన్నారు. బ్రిగేడియర్ శివ శంకర్ , కల్నల్ బీయు హ రి, మేజర్ రఘురామ్ రెడ్డి, కెప్టెన్ ఎస్‌సీ భండారి పాల్గొన్నారు.


