తిరుపతి కల్చరల్: అన్నమాచార్యుల వర్ణనా వైచిత్రి నిరుపమానమని, ఆయన సంకీర్తనల్లో శృంగార నాయికల భావాలను మధుర భక్తితో అద్భుతంగా ఆవిష్కరించారని హైదరాబాద్‌కు చెందిన నాగపద్మిని ఉద్ఘాటించారు. అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాలు సోమవారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు ఆయన అధ్యక్షత వహించి, ‘అలమేలుమంగా’ అనే అంశంపై ఉపన్యసించారు. అన్నమయ్య శృంగార సంకీర్తనల భావ వైశాల్యం అపారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెకు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, సంచాలకులు లత పాల్గొన్నారు.


