ఆశల అంబులెన్స్‌.. | - | Sakshi
Sakshi News home page

ఆశల అంబులెన్స్‌..

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

శ్రీకాళహస్తి రూరల్‌: ఆస్మా వ్యాధితో బాధ పడుతున్న తమ కుటుంబ సభ్యుడిని ‘బతికించుకుద్దాం’ అన్న ఒకే ఒక్క ఆశతో బెంగాల్‌ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఆ కుటుంబ ప్రయాణం ఊరందూరు హైవేపై అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆగి ఉన్న లారీ రూపంలో మృత్యువు ఆ కుటుంబాన్ని కాటేసింది. పేషెంట్‌ను కాపాడుకోవాలనే తపనతో 1,650 కిలోమీటర్లు అంబులెన్స్‌లో ప్రయాణించిన ఆ ఆరుగురిలో నలుగురు అశువులుబాయగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో మత్యువుతో పోరాడుతున్నారు.

బతుకుపోరాటంలో మరో ఇద్దరు

డ్రైవర్‌ రాకేష్‌ పండిట్‌ (29), బంధువు ధగోడిస్‌ (45) ఎంజీఎం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కళ్ల ముందే నలుగురిని కోల్పోయి, తాము బతుకుతామో లేదో తెలియని స్థితిలో వారి ఆవేదన వర్ణనాతీతం.

కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రశ్న?

పేషెంట్‌ను బతికించుకునేందుకు రాష్ట్రం దాటి వచ్చిన వారు, మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. జాతీయ రహదారిపై ఇలా లారీలు ఆపడంతో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో.. అని స్థానికులు కన్నీళ్లతో ప్రశ్నిస్తున్నారు. రోడ్డు ప్రమాదం కాదిది.. నిర్లక్ష్యానికి బలైన నాలుగు నిండు ప్రాణాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసులు మృతదేహాలను బెంగాల్‌కు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

అంబులెన్స్‌లో ఇరుక్కున్న మృతులు

అలసట.. నిద్రమత్తే శాపమైంది!

1,650 కిలోమీటర్లు అంటే మాటలు కాదు. రెండు రాత్రులు, ఒక పగలు అలుపెరగకుండా ప్రయాణం. డ్రైవర్‌ కళ్లలో నిద్ర, శరీరంలో అలసట, అదే వారి ప్రాణం తీసిందని డీఎస్పీ నర్సింహమూర్తి తెలిపారు. రోడ్డుపై సిగ్నల్‌ లైట్లు లేకుండా నిలిపిన సిమెంట్‌ లారీ వారి పాలిట యమపాశమైందన్నారు.

ఒకే కుటుంబం.. ముగ్గురు మృతులు..

డ్రైవర్ల అన్నదమ్ముల్లో ఒకరు

ఆగి ఉన్న సిమెంట్‌ లారీని అంబులెన్స్‌ ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అశులుబాయగా, డ్రైవర్లుగా వచ్చిన అన్నదమ్ముల్లో ఒకరు పరలోకాలకు వెళ్లారు. నుజ్జునుజ్జయిన అంబులెనన్స్‌లో నుంచి బయటకు తీసిన మృతదేహాల్లో బ్రజ డోలాయ్‌ (48), ఆయన తండ్రి జతిన్‌ డోలాయ్‌ (63), భార్య టగారి డోలాయ్‌ (35), ఒకే కుటుంబానికి చెందిన వారు. అంబులెనన్స్‌ డ్రైవర్‌ రితేష్‌ పండిట్‌ (24) ఒకరిదిగా గుర్తించారు.

1,650 కి.మీ ప్రాణం కోసం పరుగెత్తి..

అనంత వాయువుల్లో కలిసిన బెంగాలీ కుటుంబం

Advertisement
 
Advertisement
Advertisement