గాలివాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

● నేలకూలిన విద్యుత్‌ స్తంభాలు ● నిలిచిన రాకపోకలు

పలుచోట్ల విరిగిన చెట్లు

తిరుపతి తుడా:తిరుపతి నగరంలో ఆదివారం మధ్యా హ్నం గంటకు పైగా గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షానికి ఈదురు గాలులు తోడవడంతో ప్రజా రవాణా కు,విద్యుత్‌సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ చేరింది. మురు గు కాలువలు పొంగి ప్రవహించాయి. దీంతో బురద, చెత్త రోడ్లపై పేరుకుపోయింది. గాలి ఉధృతికి అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. బాలాజీ కాలనీ, ఎస్వీయూ, మహిళయూనివర్సిటీ, బైరాగి పట్టెడ, హరే కృష్ణ రోడ్డు, ముఖ్యంగా రాజన్న పార్క్‌, పద్మావతి పా ర్క్‌లోని చెట్టు విరిగాయి. పలుప్రాంతాల్లో ద్విచక్ర వా హనాలు, కార్లపై చెట్ల కొమ్మలు పడ్డాయి. ఈ క్రమంలో నే రోడ్లపై చెత్తాచెదారాలతోపాటు, చెట్ల కొమ్మలను తొలగించేందుకు కార్పొరేషన్‌ అధికారులు చర్యలు చేపట్టారు.

కారుపై పడిన చెట్టు కొమ్మ

తిరుపతి రూరల్‌ : ఈదురుగాలుల కారణంగా చెర్లోపల్లె నుంచి అలిపిరి వెళ్లే మార్గంలో రిక్షాకాలనీ వద్ద వెళుతున్న కారుపై ఓ చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని యంత్రాలతో చెట్టు కొమ్మను తొలగించారు. అలాగే ఎస్వీయూ ఆవరణలో విద్యుత్తు స్తంభాలు విరిగిపడటంతో పరిసరాల్లో కరెంట్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

వృద్ధురాలికి గాయాలు

రేణిగుంట: పట్టణంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముందస్తు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేశారు. వినాయక నగర్‌లోని ఒక రేకుల ఇంటిపై మామిడి చెట్టు కూలింది. దీంతో రాణెమ్మ(70) అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి 108లో ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement