తిరుపతి సిటీ: వైద్యవిద్యలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం తిరుపతిలో నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నగరంలోని 9 సెంటర్లలో పకడ్బందీగా పరీక్ష నిర్వహించారు. మొత్తం 4,542 మందికి గాను 127 మంది గైర్హాజరయ్యారు. 97.02 శాతం మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. నీట్ రాసే విద్యార్థులు గంటకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు ముందుగానే సూచించారు. అయినప్పటికీ పలువురు ఆలస్యంగా రావడంతో తిప్పి పంపేశారు. నీట్ ప్రశ్నపత్రం సాధారణ స్థాయిలోనే వచ్చిందని సబ్జెక్టు నిపుణులు సాక్షికి తెలిపారు. అయితే ఫిజిక్స్‌ప్రశ్నల సరళి తీరు పలువురు విద్యార్థులను బెంబేలెత్తించినట్లు తెలుస్తోంది. మ్యాథ్స్ సబ్జెక్టు కొంతవరకు తిక మకపెట్టినా, కెమిస్ట్రీ మాత్రం సులభంగానే వచ్చిందని విద్యార్థులు వెల్లడిస్తున్నారు.


