8న ఉపనయన మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

8న ఉపనయన మహోత్సవం

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

తిరుపతి కల్చరల్‌: రేణిగుంటలోని రాజరాజేశ్వరి జ్ఞానపీఠంలో ఈనెల 8న ఉదయం 7 నుంచి 8.20 గంటల వరకు సామూహిక ఉపనయన మహోత్సవం నిర్వహించనున్నట్టు పీఠం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నరసింహాచార్య, రేణిగుంట బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం ఎన్‌జీఓ కాలనీలోని జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి కార్యాలయంలో ఉపనయన మహోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ బ్రాహ్మణ కుటుంబీకులందరూ సద్వినియోగం చేసుకోవాలని, తమ పేర్లను ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని కోరారు. ఇందుకోసం ఎలాంటి ఫీజు లేదని, ఉచితంగానే పూజా సామగ్రిని సైతం అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వసతి సౌకర్యం సైతం కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు 9849120030, 9440855423 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సంఘం ప్రతినిధులు రెడ్డి ప్రకాష్‌, బాలాజీ శర్మ, శివకుమార్‌, కల్యాణకుమార్‌, డాక్టర్‌ చక్రపాణి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement