గాయపడిన భార్గవ్
ఆధ్యాత్మిక నేలపై..
పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు
చంద్రగిరి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం వల్లే దాడులు, దౌర్జన్యాలు, ధ్వంసాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటిని ఎప్పకప్పుడు అరికట్టాలని సూచిస్తున్నారు.
చంద్రగిరిలో రెచ్చిపోతున్న ముసుగు దళాలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఆధ్యాత్మికతతో అలరారే చంద్రగిరి గడ్డ ఇప్పుడు హాహాకారాలతో దద్దరిల్లుతోంది. గోవింద నామస్మరణతో మార్మోగే ప్రదేశం రక్తపు మరకలతో తడిసి ముద్దవుతోంది. గ్రామాల్లో బందిపోట్లను తలపించేలా ముసుగు దళాలు సంచరిస్తుండడం.. ప్రశ్నించే వారిపై దాడి చేయడం.. దాడి చేసే సమయంలో ‘మా నానీ అన్నను ప్రశ్నిస్తే ఇలాగే కొడతాం’ అని హెచ్చరికలు చేయడం.. వంటి చర్యలతో ఆ ముసుగు వెనుక దాగి ఉన్నది చంద్రగిరి ఎమ్మెల్యే నానీనేనా అన్న అనుమానాలకు తావిస్తోంది. చిత్తూరు, తమిళనాడు నుంచి ముసుగు దళాలను పిలిపించి దాడులు చేయిస్తున్నట్టు బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా నానీ వచ్చినప్పటి నుంచి ప్రశ్నించే వారిని కొట్టించడం, అడ్డొచ్చిన వారి ఇళ్లు తగలబెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, కార్లు, బైక్‌లు దగ్ధం చేయడం వంటి దురాగ తాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్తనాదాలు
ఆధ్యాత్మికత, ప్రశాంతత, గోవిందనామస్మరణతో మార్మోగే గడ్డ ఇప్పుడు ఆర్తనాదాలతో హోరెత్తుతోంది. తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో ముసుగు దళా లు అరాచకం చేస్తుండడం సంచలనంగా మారింది.
రౌడీ రాజకీయాలను సహించరు
తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల వాసులు రౌడీ రాజకీయాలను ఎన్నడూ సహించరు. తిరుపతి, చంద్రగిరి ప్రాంతానికి చిత్తూరు నుంచి వచ్చిన పులివర్తి నానీ రౌడీ రాజ్యాన్ని తీసుకొచ్చి గత రెండేళ్లుగా ప్రశ్నించే వారు, ముడుపులు ఇవ్వని వ్యాపారులు, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టే వారిని టార్గెట్‌గా చేసుకుని ముసుగు దళాలతో దాడులు చేయిస్తూ ప్రజల్లో భయానక వాతావరణం కల్పిస్తున్నారన్న విమర్శలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దుశ్చర్యలను చంద్రగిరి ప్రజలు హర్షించరని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మిత్రపక్షంపైనా దాడులు
ఒక పార్టీ.. ఒక మండలం.. ఒక పంచాయతీ.. ఒక ఊరని కాదు.. చంద్రగిరి నియోజకవర్గం మొత్తం ముసుగు దళాలు వరుస దాడులతో బెంబేలెత్తిస్తున్నాయి. ముసుగు దాడులు ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ నాయకులే కాదు, మిత్రపక్షమైన జనసేన, బీజేపీ వారితో పాటు వ్యాపారస్తులు, రైతులపైనా ఉండడం దారుణమంటున్నారు. పోలీసులు ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం పట్ల చంద్రగిరి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భయపడిపోతున్నారు
దేశ నలుమూలల నుంచి ఎందరో ఉద్యోగులు, మరెందరో ఆధ్యాత్మిక గురువులు, మేధావులు, శాస్త్రవేత్తలు, సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపార వేత్తలు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి, చంద్రగిరిలో స్థిరపడాలని భావిస్తుంటారు. అంతేకాదు శ్రీవారిని దర్శించేందుకు నిత్యం 90 వేల మంది దాకా భక్తులు వచ్చి వెళ్తుంటారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విదంగా తిరుపతి ఒక్కచోటే ఏడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. ఇటు ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు నెలవైన తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో ముసుగు దొంగలు చేస్తున్న అరాచకం వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. గోవిందనామాలు పలికే చోట ఆర్తనాదాలు, హాహాకారాలు మార్మోగుతున్నాయి.
ముసుగు దళాల దాడిలో తీవ్రంగా గాయపడిన పాకాలకు చెందిన కపిలేశ్వర రెడ్డి (ఫైల్)
అరాచకవాదుల దాష్టీకానికి చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామంలో దగ్ధమైన కారు (ఫైల్)
చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి పంచాయతీ కూచువారిపల్లిలో నానీ సమక్షంలోనే ఓ ఇంటికి నిప్పుపెట్టి దగ్ధం చేసిన అరాచకవాదులు (ఫైల్)
తీవ్రంగా గాయపడిన సి.రామాపురానికి
చెందిన కోదండం (ఫైల్)
అరాచకం..హాహాకారం
చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనూ ఎమ్మెల్యే నానీ ముసుగు దళాలచేత అరాచకం సృష్టించారని ఆయా మండలాల్లోని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వర కు 72 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో పాకాల నుంచి 18 మంది, చంద్రగిరి నుంచి 16, తిరుపతి రూరల్ 12, రామచంద్రాపురం 11, చిన్నగొట్టిగల్లులో 7, ఎర్రావారిపాళెంలో 8 మంది రక్త గాయాలకు గురయ్యారు. వీరంతా పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. ఇక దెబ్బలు తిని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కని వాళ్లు వందల మంది ఉన్నారు. ఫ్యామిలీ డాబా లు, బిర్యానీ సెంటర్‌లు, చికెన్ పకోడా, పూల దుకాణాలు, మెడికల్ షాపు, బట్టల షాపులను జేసీబీలతో ధ్వంసంచేసి నేల మట్టం చేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. పంటలను ధ్వంసం చేయించారని, దారులకు అడ్డుగా కందకాలు తవ్వించారని, మామిడి తోటలు నరికించారని ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టించారని మండిపడుతున్నారు.


