నాగలాపురం: మండల కేంద్రంలోని టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో బాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి స్వామివారు ముత్యపు పందిరి వాహనం పై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు బట్టాచార్యులు వేకువ జామున ఆలయాన్ని శుద్ధి చేసి నిత్య కై ంకర్యాలు పూర్తి చేశారు. గ్రామోత్సవం అనంతరం ఆలయానికి చేరుకున్న వెదనారాయణుడికి ఆలయ ప్రాంగణలో దేవదేరులతో స్నపన తిరుమంజనం చేశారు. సాయంత్రం జ్ణాన సరస్వతీ దేవిగా స్వామి వారిని ఊంజల్ సేవలో కొలువు దీర్చి ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి స్వామి వారి ఉత్సవమూర్తులను ముత్యాలతో, సుగంధ పుష్ప మౌలికలతో సుందరంగా అలంకరించి ముత్యపు పందిరి వాహనం పై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ సూపరింటెండెంట్ ఽశ్రీనివాసులురెడ్డి, ఆలయ అధికారులు శ్రీనివాసులు, చెంగల్‌రాయులు, ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు.


