కదిలింది స్వర్ణరథం.. మెదిలింది
అమ్మరూపం.. భక్తజనుల పెదవులు అర్చించాయి.. మనసు సిరుల తల్లిని కీర్తించింది.. కరాలు వందనం
అర్పించాయి.. కర్ణాలు శ్రీవారి దేవేరి నామస్మరణలతో నిండిపోయాయి..
తనువులో తల్లిలో లీనమైంది..
అణువణువునా.. తనువు తనువునా అమ్మరూపమే కొలువైంది. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక
వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం శ్రీపద్మావతి
అమ్మవారు స్వర్ణరథంపై కొలువుదీరి భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా
జరిగింది. –చంద్రగిరి


