గంజాయి రహిత తిరుపతే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

గంజాయి రహిత తిరుపతే లక్ష్యం

May 2 2026 11:55 AM | Updated on May 2 2026 11:55 AM

తిరుపతి క్రైం: తిరుపతి జిల్లాను గంజాయి రహిత జిల్లా మార్చడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు తిరు పతి జిల్లా పోలీస్‌ శాఖ సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని జిల్లా ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు పేర్కొన్నారు. శుక్ర వారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. యువత భవిష్యత్తును దెబ్బతీసే మాదకద్రవ్యాల నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో గంజాయి నిర్మూలన కోసం నాలుగు అంచెల విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయాలు, క ళాశాలలు, కాలనీలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు, ర్యాలీ లు నిర్వహిస్తూ యువతలో చైతన్యం పెంచుతున్నామని చెప్పా రు. గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. పదే పదే గంజాయి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న 16 మందిని గుర్తించి వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయగా, అందులో 12 మందికి ఆమోదం లభించి జైలుకు పంపించామని, మిగిలిన నలుగురు పరిశీలనలో ఉన్నారని పేర్కొన్నారు. గంజాయి వినియోగదారులను గుర్తించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన మెడికల్‌ టెస్ట్‌ కిట్లను ప్రవేశపెట్టామని ఎస్పీ తెలిపారు. విద్యాసంస్థల్లో గంజాయి వినియోగంపై అనుమానం ఉన్న సందర్భాల్లో ఆధారాలతో టెస్టులు నిర్వహించే విధానాన్ని కూడా అ మలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పోలీస్‌ శాఖకు సహకరించి గంజాయి రహిత తిరుపతి జిల్లాను సాధించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గంజాయి సంబంధిత సమాచారం ఉంటే వెంటనే 1972, 112 టోల్‌ ఫ్రీ నంబర్లకు కాల్‌ చేసి తెలియజేయాలని, అదనపు ఎస్పీలు వెంకట్రావు, రవి మనోహర్‌ ఆచారి, ఐ రామకృష్ణ , శ్రీనివాస్‌, ఎస్బీ డీఎస్పీ గీతా కుమారి పాల్గొన్నారు.

సాయుధ దళాల పరేడ్‌పై ఎస్పీ సమీక్ష

తిరుపతి జిల్లా పోలీస్‌ శాఖలో సాయుధ దళాల పరేడ్‌ను జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరు, క్రమశిక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముందుగా నిర్వహించిన పరేడ్‌ను పరిశీలించిన ఎస్పీ, అనంతరం సాయుధ దళ పోలీసులతో గ్రీవెన్‌న్స్‌సెల్‌ (దర్బార్‌) సమావేశం నిర్వహించారు. శుక్రవారం పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్‌ వ్యవస్థలో ఏఆర్‌ విభాగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అదనపు ఎస్పీలు వెంకట్రావు , శ్రీనివాసరావు, డీఎస్పీ చంద్రశేఖర్‌, ఏఓ సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement