తప్పిపోయిన మహిళ సురక్షితం | - | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన మహిళ సురక్షితం

May 2 2026 11:55 AM | Updated on May 2 2026 11:55 AM

నాగలాపురం: అడవిలో తప్పిపోయిన మహిళ ఆచూకీ లభించింది. మండలంలోని బీరకుప్పం గ్రామానికి చెందిన చిన్నముట్టు ద్రాక్షాయణి ఉపాధి హామీ పనులకు వెళ్లి బుధవారం భూపతేశ్వర అడవిలో తప్పి పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నాగలాపురం పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం బీరకుప్పం ఎస్సీకాలనీకి చెందిన కొందరు ఉపాధి హామీ పనులకు అడవికి వెళ్లారు. ఆ సమయంలో ఓ మహిళ గట్టిగా కేకలు వినిపించడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఆమెను ద్రాక్ష్యాయణిగా గుర్తించారు. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని మహిళను సురక్షితంగా గ్రామానికి చేర్చారు.

పసిడి పతకం సాధించిన విద్యార్థినికి సన్మానం

తిరుపతి సిటీ: కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్‌ కళాశాల ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, డేటా సైనన్స్‌ విభాగం 2021– 25 బ్యాచ్‌ విద్యార్థిని ఎస్‌ భావన జేఎన్‌టీయూ పరిధిలో 87.58 శాతం మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. ఇటీవల అనంతపురం జేఎన్‌టీయూ వేదికగా జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్‌ చేతుల మీదుగా బంగారు పతకం, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కళాశాల చైర్మన్‌ మన్నెం రామిరెడ్డి విద్యార్థిని భావనను కళాశాలలో నగదు బహుమతిని అందజేసి, ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి భావన జేఎన్‌టీయూ పరిధిలో టాపర్‌గా నిలివడం శ్రీరామ కళాశాలకు గర్వకారణమని కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి కల్పనే ధ్యేయంగా కళాశాల లక్ష్యమని తెలిపారు. విద్యార్థిని భావన మాట్లాడుతూ ఈ ఘనత సాధించడం వెనుక కళాశాల అధ్యాపకులు శిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్‌ మన్నెం అరవింద్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జయచంద్ర, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌ వాసు, అధ్యాపకులు పాల్గొని విద్యార్థినిని అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement