తిరుపతి అర్బన్: పది ఫలితాల్లో ప్రైవేటు పాఠశాలలు సత్తా చాటుకున్నాయి. గురువారం విడుదలైన టెన్త్ ఫలి తాల్లో తిరుపతికి చెందిన జీఎస్‌ఆర్ మ్యాగ్నెట్ స్కూల్‌కి చెందిన పి. జెష్మిత 600 మార్కులకు 598 మార్కులు సాధించి స్టేట్‌లోని రెండో స్థానంలో నిలిచింది. అలాగే 53 మంది విద్యార్థులకు 47 మంది మొదటి తరగతి, ఆరుగురు విద్యార్థులు రెండో తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ జి. సత్యనారాయణ ఆమెను అభినందించారు.
కోడూరు విద్యార్థికి ..
రైల్వేకోడూరు: బలిజవీధికి చెందిన పండ్రా సు బ్రమణ్యం కు మార్తె పండ్రా ఖ్యాతి గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 600 మార్కులకు 598 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో స్థానం సాధించింది. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు పండ్రా ఖ్యాతిని అభినందించారు.
ఉన్నత స్థాయికి చేరుకోవాలి
తిరుపతి అర్బన్: పదో తరగతిలో ఉత్తమ మార్కు లు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అభినందించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పరిధిలో ఎస్. దిషిత సాయి, 595 మార్కులతో ప్రథమ స్థానం, జి. సాయి పూజిత 594 మార్కులతో ద్వితీయ స్థానం, మోహిత్ చరణ్‌సాయి 591 మార్కులతో తృతీయ స్థానంలో నిలిశారు. వీరికి కలెక్టర్ చేతుల మీదుగా ట్యాబ్‌లను బహూకరించారు. అలాగే విలువైన పుస్తకాలు, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కేవీఎన్ కుమార్, డీఆర్వో నరసింహులు, సీఎంఓ సురేష్ పాల్గొన్నారు.


