రెండు నెలల క్రితం అధికారులు వచ్చి షాపుల ముందున్న రేకులు తొలగించాలని చెప్పారు. మేమే స్వచ్ఛందంగా తొలగించాము. ఇప్పుడు షాపులు మొత్తం తొలగించాలని అంటున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిడితోనే ఇలా చేస్తున్నట్టు అనుమానం ఉంది. ఉన్నతాధికారులు మాకు న్యాయం చేయాలి. – శివ ప్రసాద్, బాధితుడు, కరకంబాడి
మా పరిస్థితి ఏమిటి?
మా నాన్న పాల దుకాణం పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా షాపును తొలగిస్తామనడం బాధగా ఉంది. అభివృద్ధికి మేము అడ్డుకాము. అధికారులు ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట చెప్పడం న్యాయం కాదు. మా 20 కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. – సిద్ధేష్ బాధితుడు కరకంబాడి


