దుకాణాల తొలగింపునకు యత్నం | - | Sakshi
Sakshi News home page

దుకాణాల తొలగింపునకు యత్నం

Apr 30 2026 9:30 AM | Updated on Apr 30 2026 9:30 AM

● ఉన్నఫళంగా తొలగిస్తే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్న ● నష్టపరిహారం ఇవ్వకుండా కూల్చడం అన్యాయం

అడ్డుకున్న బాధితులు

రేణిగుంట: మండలంలోని కరకంబాడి రైల్వే గేట్‌ సమీపంలో రేణిగుంట– కడప జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలను తొలగించేందుకు అధికారులు బుధవారం ప్రయత్నించారు. వారిని బాధితులు అడ్డుకున్నారు. దశాబ్దాలుగా రోడ్డు పక్కన దుకాణాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఉన్నఫళంగా తొలగిస్తే ఎక్కడికి పోవాలని వాపోయారు. వారు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల రోడ్డు విస్తరణ కోసమని అధికారుల సూచనల మేరకు దుకాణాల ముందు ఉన్న రేకులను స్వచ్ఛందంగా తొలగించామని తెలిపారు. ఇప్పుడు సుమారు 20 దుకాణాలకు పైగా కూల్చి వేస్తామనడం దారుణమన్నారు. ముందుగా నోటీసులు ఇవ్వడంతోపాటు ఉపాధి కల్పించి దుకాణాలను కూల్చాలని కోరారు. లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. దీనిపై కలెక్టర్‌ స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

దుకాణాల ముందు రేకులు తొలగించిన దృశ్యం

Advertisement
 
Advertisement
Advertisement