వెంకటగిరి రూరల్ : మండలంలోని శివలింగాపురం వద్ద బుధవారం పొలం విషయంపై జరిగిన ఘర్షణలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పారవోలు హరిజవాడకు చెందిన వెంకటసుబ్బయ్య పొలం వద్దకు వెళుతుండగా శివగిరికి చెందిన కొందరు కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని కుటుంబ సభ్యులు వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని
వ్యక్తికి తీవ్ర గాయాలు
చంద్రగిరి: మండలంలోని ఏ.రంగంపేటలో బుధవారం ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. పీలేరుకు చెందిన శంకర్ వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంలో తిరుపతికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఏ.రంగంపేట వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో శంకర్ కుడికాలు విరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ పథం
తిరుపతి అర్బన్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి బుధవారమూ స్వచ్ఛ పథం పేరుతో ని రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగిస్తామని జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి తెలిపారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తొలి బుధవారం జిల్లాలోని 811 పంచాయతీలకు గాను 755 పంచాయతీల్లో కార్యక్రమాన్ని అమలు చేశామని చెప్పారు. ఇందులో భాగంగా 930 కిలోమీటర్ల రోడ్లలో 2,990 మంది పారిశుద్ధ్య కార్మికులు 1,124 టన్నుల చెత్త కుప్పలు, వ్యర్థాలను తొలగించారని వెల్లడించారు.
చెక్‌బౌన్స్ కేసులో
ఆరు నెలల జైలు
నాయుడుపేట టౌన్ : చెక్‌బౌన్స్ కేసులో ఒకరికి ఆరు నెలల జైలుశిక్ష విధించడంతోపాటు రూ.6 లక్షలు చెల్లించాలని నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మీనాక్షి సుందరి బుధవారం తీర్పు ఇచ్చారు. న్యాయవాది కొమ్మ శ్రీనివాసులు కథనం మేరకు.. నాయుడుపేట పట్టణానికి చెందిన దక్షణాది బాబుకు 2020లో అప్పు చెల్లించడంలో భాగంగా దాసరి శశిధర్ రూ.6 లక్షల చెక్కు ఇచ్చాడు. దాన్ని బ్యాంకులో వేయగా బౌన్స్ అయింది. దీనిపై బాధితుడు నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశాడు. కేసు పూర్వాపరాలను విచారించిన జడ్జి మీనాక్షి తీర్పు చెప్పారు. నిందితుడు దాసరి శశిధర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. బాధితుడైన దక్షణాది బాబుకు రూ.6 లక్షలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు.


