తిరుపతి క్రైం : తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పోలీసింగ్‌లో కొత్త దిశగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఎస్పీ సుబ్బరాయుడు బుధవారం అత్యాధునిక డ్రోన్ కెమెరాలను అధికారికంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలను ముందుగానే గుర్తించి వాటిని అరికట్టడంలో డ్రోన్ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. ఈ డ్రోన్ కెమెరాలు కృత్రిమ మేథస్సుతో పనిచేస్తూ పెద్ద సంఖ్యలో ఉన్న జన సమూహాన్ని క్షుణ్ణంగా లెక్కిస్తాయని, అధిక నాణ్యత గల ఫొటోలు, వీడియోలు అందిస్తాయని వెల్లడించారు. వీటితో రాత్రి–పగలు తేడా లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించవచ్చన్నారు. ఈ డ్రోన్‌లలో అమర్చిన ధ్వని ప్రసార పరికరం ద్వారా ప్రజలకు వాయిస్ సందేశాలు, హెచ్చరికలను ప్రత్యక్షంగా చేరవేయవచ్చని చెప్పారు. అత్యవసర పరిస్థితులు, రవాణా నియంత్రణ, జన సమూహ నిర్వహణలో ఉపయోగపడతాయని వివరించారు.
పోలీసింగ్‌లో కొత్త దిశ
Apr 30 2026 9:30 AM | Updated on Apr 30 2026 9:30 AM
● ఆధునిక డ్రోన్లతో నేరాల నియంత్రణ
● డ్రోన్లను ప్రారంభించిన ఎస్పీ ● వెలుతురు ప్రసరించే దీపం సదుపాయం కారణంగా చీకట్లో కూడా శోధన చర్యలు నిర్వహించడం సులభమవుతుందని తెలిపారు. అధిక స్పష్టత గల కెమెరా, బహు దిశల చిత్రీకరణ వ్యవస్థ, నూట పన్నెండు రెట్లు సమీపంగా చూపించే సామర్థ్యంతో దూర ప్రాంతాల్లో కూడా స్పష్టమైన దృశ్యాలను సేకరించవచ్చని చెప్పారు. ఉష్ణోగ్రత ఆధారిత సాంకేతికత వల్ల తక్కువ వెలుతురు ఉన్న ప్రాంతాల్లో కూడా మనుషులను సులభంగా గుర్తించడం సాధ్యమవుతుందన్నారు. మనుషుల శోధన, అగ్ని ప్రమాదాల గుర్తింపు, రాత్రి చర్యల్లో ఇది కీలకంగా పనిచేస్తుందన్నారు.
● కదలికల ప్రభావం లేకుండా చిత్రాలు స్పష్టంగా కనిపించే సదుపాయం వల్ల అసాంఘిక కార్యకలాపాలను సులభంగా గుర్తించి చర్యలు తీసుకోవడం మరింత సులభమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రతి ఉప విభాగానికి ఈ డ్రోన్ కెమెరాలను అందజేసి వినియోగంలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ డ్రోన్ వ్యవస్థ సైబర్ విభాగం ఆధీనంలో పనిచేస్తూ ఆధునిక విజిబుల్ పోలీసింగ్ సేవలను అందిస్తుందని వివరించారు. గ్రీంటెక్ ఇండస్ట్రీస్ (ఇండియా) పివిటీ, ఎల్‌టీడీ సంస్థ ఒక ఆధునిక డ్రోన్‌ను వితరణ చేసింది. ఆ సంస్థ ప్రతినిధులకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement


